వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జగన్ చూపిన మానవత్వం, చిన్నారి పట్ల ఆయన అభిమానం అందరి హృదయాలను హత్తుకుంటోంది.
జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు ఒక చిన్నారి తన తండ్రితో కలిసి ఎయిర్‌పోర్టుకు వచ్చింది. జగన్ జనంలోకి వస్తున్న సమయంలో, ఆ బాలిక కాలి నుంచి చెప్పు జారి కింద పడింది. చుట్టూ ఉన్న సందడిలో ఆ విషయం ఎవరూ పెద్దగా గమనించలేదు.
అయితే, జనసమూహం మధ్యలో వేగంగా ముందుకు వెళ్తున్న జగన్, వెంటనే ఆ దృశ్యాన్ని గమనించారు. తక్షణమే అక్కడ ఆగి, కింద పడిన ఆ చిన్నారి చెప్పును స్వయంగా తన చేతులతో తీశారు. ఆ తర్వాత ఆ చిన్నారికి చెప్పును అందించారు. ఈ అనూహ్య సంఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రతిపక్ష నేతగా విశేష జనాదరణ ఉన్నప్పటికీ, జగన్ మోహన్ రెడ్డి చూపిన ఈ ప్రేమ, సంస్కారం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. “జగన్ అన్నది కేవలం నాయకుడే కాదు… ఆయనలో ఈ ప్రేమ, అభిమానం నిండి ఉంది,” అని ఒక అభిమాని కామెంట్ చేయగా, “సాధారణ ప్రజలతో ఆయన అనుబంధం ఇలా ఉంటుంది,” అని మరొకరు పేర్కొన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.
https://x.com/Telugufeedsite/status/1995734994568761678?s=20

