Top Stories

జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం – వైసీపీలో కాంగ్రెస్ విలీనం?

జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపట్ల అనుబంధం చిన్ననాటి నుంచే ఉంది. ఆయన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ పట్ల అచంచలమైన నిబద్ధతను కొనసాగిస్తూ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన విజయానికి జగన్మోహన్ రెడ్డి పూర్తి మద్దతుగా నిలిచారు. 2009లో కడప ఎంపీగా విజయం సాధించినా, 2010లో తండ్రి ఆకస్మిక మరణం అనంతరం కాంగ్రెస్ పార్టీతో విభేదించడం ప్రారంభించారు.

తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనుకున్న జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా కేసులు పెట్టించారు, చివరికి ఆయనను జైలుకు కూడా పంపించారు. ఈ అవమానాలను తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ నుంచి తన అనుచరులను తన వెంట తీసుకువచ్చారు. తన వెంటే వచ్చిన సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చి, కొత్తదారి తొక్కించారు.

అయితే, 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయ్యింది. ఈ విపరీత పరిస్థితుల్లో పార్టీకి చెందిన అనేక మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో మిగిలిపోయిన సీనియర్ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం ప్రారంభించారు.

ఇప్పటికే మాజీ పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్, కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ వంటి అనేక మంది నాయకులు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీపై ఎప్పుడూ విమర్శలు గుప్పించిన తులసి రెడ్డిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం, జగన్ తను పూర్తిగా మారిపోయినట్లు సంకేతాలిస్తున్నాయి.

నిన్నటి వరకు వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నడిచింది. కానీ, ఇప్పుడు ఈ కథనం పూర్తిగా మారిపోయింది. జగన్ వైసీపీలోకి కాంగ్రెస్‌ను చేర్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే మరిన్ని కీలక పరిణామాలు జరగబోతున్నాయనే ఉహాగానాలు నెలకొన్నాయి.

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories