Top Stories

తెలంగాణ నేతలపై జనసేన అరుణ సెటైర్లు

కోనసీమ కొబ్బరికి తెలంగాణ నేతల ‘దిష్టి’ తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీహరి తదితరులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రి క్షమాపణ చెప్పకపోతే, ఆయన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని హెచ్చరించారు.

ఈ వివాదంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించకపోయినా, పార్టీ అధికార ప్రతినిధి జనసేన అరుణ మాత్రం తెలంగాణ నేతలపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.

ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన జనసేన అరుణ, దిష్టి వ్యాఖ్యల వివాదంపై తెలంగాణ నేతల తీరును తప్పుబట్టారు. “దిష్టి” అనే పదం అంత పెద్ద వివాదాస్పదమైన పదమని తమకు తెలియదని ఆమె అన్నారు.

“దిష్టి అంటే మామూలుగా అంత పెద్ద వర్డ్ అని తెలియదు. చిన్న పిల్లలకు, పెళ్లి కూతురు, పెండ్లికొడుకులకు దిష్టి తీయడం కామన్. దీన్ని కూడా వివాదం చేసి, మీడియా ముందు సవాళ్లు చేసి, బెదిరిస్తారని తెలియక ఇన్నాళ్లు వాడామా?” అని ఆమె మండిపడ్డారు.

ఈ సందర్భంగానే ఆమె తెలంగాణ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. “పనికి మాలిన వాళ్లంతా మోపయ్యారు తెలుగు రాష్ట్రాల్లో…” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

తెలంగాణ నేతలు, మంత్రులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో జనసేన అధికార ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఘర్షణ వాతావరణాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మాటల యుద్ధంతో వేడెక్కిన రాజకీయ వాతావరణంలో, జనసేన అరుణ వ్యాఖ్యలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.

https://x.com/greatandhranews/status/1995867347056558267?s=20

Trending today

పవన్ కళ్యాణ్ మాజీ భార్య సన్యాసం..

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య,...

పేర్ని నాని చాలెంజ్.. పవన్, లోకేష్ సమాధానం చెప్పండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి విమాన ప్రయాణ ఖర్చుల వివాదంతో వేడెక్కాయి. మాజీ...

‘ఎయిడ్స్’పై ఓపెన్ అయిన బాబు.. వీడియో

గతంలో ఎయిడ్స్ అనే పేరు వింటేనే ప్రజలు భయపడి పారిపోయేవారు. ముఖ్యంగా...

తెలంగాణను వదిలేసి ఆంధ్రాకు వెళ్లిపో పవన్ కళ్యాణ్

కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ల 'దిష్టి' తగిలిందన్న ఏపీ డిప్యూటీ...

టీడీపీ కోట్లకు కోట్లు పంచేసిందిలా..

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాలు, సభలు,...

Topics

‘ఐరన్ డోమ్’కి మించిన రక్షణ కవచం

ఇజ్రాయెల్ అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు ఐరన్ డోమ్ . శత్రువుల...

ఒకే… ఒకే… అర్థమయ్యింది వెంకటకృష్ణ!

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ యాంకర్ అయిన వెంకటకృష్ణ మరోసారి తన ఛానెల్‌లో...

చెప్పుతో కొడతా నా కొడుకా..

ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో...

Related Articles

Popular Categories