నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన ఆరోపణలు చేస్తూ నాతవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ప్రకారం, సూర్యచంద్ర తనతో సన్నిహితంగా వ్యవహరిస్తూ పెళ్లి హామీ ఇచ్చాడని, ఆ నమ్మకంతోనే తనను మోసం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. అంతేకాదు, తన భర్తను చంపేస్తానని బెదిరించి విడాకులు ఇప్పించి తన కాపురాన్ని పూర్తిగా పాడుచేశాడని తెలిపింది.
ఇదే క్రమంలో ఈ నెల 17వ తేదీ రాత్రి సూర్యచంద్ర మద్యం మత్తులో తన ఇంటికి వచ్చి, తనను మరియు తన కుటుంబ సభ్యులను కర్రతో కొట్టి గాయపరిచినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దాడిలో కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయ్యాయని ఆమె వాపోయింది.
సూర్యచంద్ర వల్ల తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమను కాపాడాలని బాధిత మహిళ పోలీసులను వేడుకుంది. ఈ ఘటనపై నాతవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న వ్యక్తిపై వచ్చిన ఈ ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఈ వ్యవహారంలో పూర్తి నిజానిజాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఆరోపణలపై జనసేన పార్టీ స్పందన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
https://x.com/TeluguScribe/status/2013161343021695455?s=20
పెళ్ళి చేసుకుంటానని నమ్మించి వివాహితను శారీరకంగా వాడుకొని మోసం చేసిన జనసేన నాయకుడు
నర్సీపట్నం జనసేన ఇంచార్జి సూర్యచంద్ర తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని మోసం చేసాడని నాతవరం పీఎస్లో ఫిర్యాదు చేసిన మహిళ
తన భర్తను చంపుతానని జనసేన ఇంచార్జి సూర్యచంద్ర బెదిరించి… pic.twitter.com/xY0LOtfo7W
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026

