తెలుగు రాజకీయాల్లో అభిమానానికి మరో పేరు జనసేన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల ఆయన అభిమానులు చూపే నిబద్ధత మరోసారి రుజువైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడంతో పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వ్యవహారంలో సినీ పరిశ్రమలోని కొరియోగ్రాఫర్ల సంఘం జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా నిలిచింది. అయితే తాజాగా అదే సంఘానికి జానీ మాస్టర్ భార్య గౌరవ అధ్యక్షురాలిగా ఎంపిక కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పదవికి ఆమె చేరడంలో జనసైనికుల బలమైన మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది.
ఎక్కడైతే జానీ మాస్టర్ ఇబ్బంది పడ్డారో, అక్కడే ఆయన కుటుంబానికి గౌరవం కల్పించేలా జనసైనికులు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది.


