తెలంగాణ రాజకీయాల్లో కవిత సస్పెన్షన్‌కి తర్వాత అందరూ “ఇక కవిత ఎటు?” అని అనుకుంటుంటే… ఎప్పటిలాగే “సొంత స్టైల్”లో ఎంట్రీ ఇచ్చాడు కేఏ పాల్!
వీడియో రిలీజ్ చేస్తూ “బీఆర్సీ నుంచి కవితను సస్పెండ్ చేసారంటే బాగుంది… ఇక మా దగ్గర ఛాన్స్ ఖాళీ ఉంది. బీసీల కోసం మీరు పోరాడుతున్నారు, మేము కూడా పోరాడుతున్నామంటాం. ఇద్దరం కలిస్తే బీసీలే గాక, మొత్తం తెలంగాణా గెలుస్తాం!” అని కేఏ పాల్ భలే పిలుపునిచ్చారు.
ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్లాన్ కూడా రెడీ చేసి పెట్టేశారు పాల్ గారు. “కవిత గారు మీరు మా పార్టీలో చేరండి. మనం ఇద్దరం కలిసి పోటీ పడితే, కనీసం డిపాజిట్ మరిచిపోతామేమో గాని, మీడియా టాప్ ట్రెండ్ మాత్రం మనమే అవుతాం!” అని తెగ నమ్మకం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ కలర్ ఫుల్ కామెడీ ఎంట్రీలు ఇచ్చే కేఏ పాల్ ఈసారి కూడా అదే రీతిలో కవితను తన పార్టీలోకి ఆహ్వానిస్తూ కొత్త చర్చ మొదలు పెట్టారు.
అసలు కవిత నిజంగానే ప్రజాశాంతి పార్టీ కరెంట్ షాక్ తట్టుకుని చేరతారా? లేక పాల్ పిలుపు మళ్లీ ‘వైరల్ కామెడీ’గానే మిగిలిపోతుందా అన్నది చూడాలి.