Top Stories

కేఏ పాల్ పవన్, చంద్రబాబుపై సెటైర్లు – వైరల్ అవుతున్న వీడియో

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, తన కామెంట్లతో చర్చనీయాంశంగా నిలిచారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో కేఏ పాల్, పవన్ కళ్యాణ్‌ స్టైల్‌ని ఇమిటేట్ చేస్తూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “పవన్ కళ్యాణ్… రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావ్!” అంటూ నేరుగా విమర్శించిన కేఏ పాల్, జగన్ ప్రభుత్వంపై పవన్ చేసిన ఆరోపణల్ని గుర్తు చేసుకుంటూ, “రూ.50 మందు రూ.150కి అమ్ముతున్నారని మీరు (పవన్) జగన్ మీద ఆరోపించారు. కానీ ఇప్పుడు మీరు మద్యం రేట్లు మరింత పెంచారు!” అంటూ ఎదురుదాడి చేశారు.

ఇక పవన్ పాత వ్యాఖ్యలను గుర్తుచేసిన కేఏ పాల్, “30 వేల మంది మిస్సింగ్ అమ్మాయిలను వెతుకుతానని చెప్పిన పవన్, ఇప్పుడు ఆ విషయమే మర్చిపోయారు!” అంటూ పవన్ నిబద్ధతపై ప్రశ్నలు సంధించారు.

చంద్రబాబుపై కూడా విమర్శలు
పవన్‌తో పాటు చంద్రబాబును కూడా టార్గెట్ చేసిన కేఏ పాల్, “ఖజానా ఖాళీ అయిందని ఏడుస్తున్నారు. అప్పుల గురించి హామీలు ఇచ్చే ముందు తెలియదా చంద్రబాబు నాయుడు?” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కేఏ పాల్ కామెంట్లతో ఈ వీడియో ప్రస్తుతం విపరీతంగా షేర్ అవుతుండగా, పవన్ అభిమానులు మాత్రం ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు కొంతమంది నెటిజన్లు కేఏ పాల్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతుండగా, కేఏ పాల్ ఇంకా ఏమైనా సంచలన వ్యాఖ్యలు చేస్తారా? లేదా పవన్, చంద్రబాబు దీన్ని ఎలా తీసుకుంటారు? అనేది ఆసక్తికరంగా మారింది.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

Topics

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

రాయపాటికి అరుణపై వెంకటరెడ్డి వైల్డ్ ఫైర్.. వైరల్ వీడియో

టీవీ చర్చా వేదికలు ప్రస్తుతం రాజకీయ విమర్శలకు, మాటల యుద్ధాలకు కేంద్రంగా...

ఏబీఎన్ వెంకటకృష్ణ.. మళ్లీ ఏసాడు

సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్...

బాబు వీడియో చూసి నవ్వితే బాగోదు…. ముందే చెప్తున్నా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ షో ఏదైనా ఉందంటే...

Related Articles

Popular Categories