Top Stories

రామోజీని మించి కిరణ్ కక్షసాధింపు

మీడియా ముసుగులో ఈనాడు సంస్థలు సాగించే అరాచకాలు ఇన్నన్ని కావు. తమకు నచ్చిన వారిని లక్ష్యంగా చేసుకొని వేధింపులకు పాల్పడడం ఈ సంస్థ నైజం. ఈ సంస్థ అధిపతి రామోజీరావు ఈనాడు పత్రికను ఉపయోగించుకునే ఒక వ్యవస్థని సృష్టించుకున్నాడు. రామోజీరావుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి అన్న, ఆయన కుటుంబం అన్న అస్సలు నచ్చదు. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత నుంచి ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పత్రికల్లో కథనాలు వండించడం ఈనాడుకు పరిపాటిగా మారింది. ఆ తరువాత ఆంధ్రజ్యోతి కూడా దీనికి జత చేరింది. ఈ రెండు పత్రికలు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఉద్దేశించి అనేక సందర్భాల్లో రాజశేఖరరెడ్డి.. తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పత్రికలు అంటూ అనేక సందర్భాల్లో ఆరోపణలు గుప్పించారు.

రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైయస్ కుటుంబ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. రాజశేఖర్ రెడ్డిపై ఉన్న ద్వేషాన్ని, కోపాన్ని వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఈనాడు సంస్థ చూపించింది. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, లక్షల కోట్లు దోచేసాడంటూ అనేక అడ్డగోలు వార్తలను ఈ పత్రిక ప్రచురించింది. ఒకరకంగా జగన్ ను బద్నాం చేయడమే లక్ష్యంగా ఈనాడు తన జర్నలిజం చేస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈనాడు.. ఆ తరువాత మళ్లీ యధావిధిగా తన వైయస్ కుటుంబ ద్వేషాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. రామోజీకి చెందిన చిట్ఫండ్ కంపెనీ వ్యవహారంలో సిఐడి విచారణకు జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో ఆ తరువాత నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా తారాస్థాయికి జర్నలిజాన్ని తీసుకెళ్లి కథనాలు రాస్తూ వచ్చింది. ఎన్నికల సమయంలో అయితే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికి, తప్పుడు కథనాలు రాయడానికే పేపర్ మొత్తాన్ని వినియోగించింది. రోజుకో అంశాన్ని తీసుకొని ప్రధాన పత్రికతోపాటు ఆయా జిల్లాల్లోని ఎడిషన్లలో కూడా అవే అంశాలపై కథనాలు వచ్చేలా రామోజీరావు ఆదేశాలు జారీ చేశారు. ఒకరకంగా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించడంలో వీరంతా సఫలం అయ్యారని చెప్పవచ్చు. రామోజీరావు కొద్దిరోజుల కిందటే మృతి చెందారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఈనాడు ఈటీవీ బాధ్యతలను కిరణ్ చూస్తున్నారు.

రామోజీరావు కంటే దారుణంగా, మరింత అడ్డగోలుగా తన జర్నలిజంను ముందుకు తీసుకు వెళుతూ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా కథనాలను ఈనాడులో వండివార్పించే ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతున్నారు. కుటుంబ వివాదమే అయినప్పటికీ షర్మిల అంశాన్ని రోజువారి వార్తల్లో హైలెట్ చేస్తూ జగన్ ను ప్రజల్లో చులకన చేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అదే సమయంలో అధికారాన్ని కోల్పోయి ఐదు నెలలు దాటుతున్న ఇప్పటికీ గత ప్రభుత్వ విధానాలపై అడ్డగోలు కథనాలను ప్రచురిస్తూ తన తండ్రి కంటే తానే తక్కువ కాదు అన్నట్టుగా జగన్ పై విషం కక్కే ప్రయత్నాన్ని ఈనాడు కిరణ్ చేస్తున్నారు. రోజుకో అడ్డగోలు కథనం, రోజుకో విషయంపై విషం కక్కడం పనిగా పెట్టుకున్న కిరణ్.. జగన్ ను పూర్తిగా అనగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఈనాడులో వచ్చే కథనాలను చూస్తున్న పాఠకులు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి సీఎం అనుకుంటున్నట్టుగా ఈనాడు సంస్థ వ్యవహరిస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అధికారపక్షం చేసే తప్పులను ఎత్తి చూపించాల్సిన ఈనాడు.. అధికారాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డిపై ఎప్పటికీ బురదజల్లే ప్రయత్నం మానుకోవడం లేదంటూ పాఠకులు వాపోతున్నారు. ఇదేమి జర్నలిజం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న నికార్సైన అడ్డగోలు జర్నలిజంగా ఎంతోమంది చెబుతున్నారు.

ఏదిఏమైనా జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు కంటే దారుణంగా ఆయన కుమారుడు కిరణ్ వ్యవహరిస్తూ కథనాలను రాయిస్తున్నారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది. ఈ కథనాల వల్ల ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఇటువంటివి రాయడం వలన ఈనాడు ఇమేజ్ డ్యామేజ్ కావడం తప్పితే జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఒనగూరే నష్టం ఏమీ ఉండదు అని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories