Top Stories

నవ్వితే అరెస్ట్ చేస్తారా?

ప్రముఖ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని ఆదేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. సాక్షి ఛానెల్‌ డిబేట్‌లో అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ పీకే మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “టీవీ డిబేట్‌లో నవ్వినంత మాత్రాన అరెస్ట్‌ చేస్తారా? అలాగైతే కేసుల విచారణ సందర్భంగా మేమూ నవ్వుతుంటాం. వాక్ స్వాతంత్రాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయండి. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలి” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడుదల సందర్భంగా అవసరమైన షరతులను ట్రయల్‌ కోర్టు విధిస్తుందని కూడా పేర్కొంది.

పిటిషన్‌లో ప్రధానాంశాలు:

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు అక్రమమని ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి మద్దతుగా పలు వాదనలు వినిపించారు.

మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అయితే, నోటీసు ఇవ్వకుండానే కొమ్మినేనిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇది సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని పిటిషనర్లు తెలిపారు.

కేఎస్సార్‌ లైవ్‌ షోలో అతిథి చేసిన వ్యాఖ్యలకు యాంకర్‌ ఎలా బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని అతిథిని కేఎస్సార్‌ నియంత్రించారని, వాటిని సమర్థించలేదని వివరించారు.

తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో, అదీ ఆంధ్రప్రదేశ్‌లో రిమాండ్‌ చేశారని, పైగా ట్రాన్సిట్‌ రిమాండ్‌ తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అని, ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదని, పైగా 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్‌ అని గుర్తు చేశారు. ఆయన దర్యాప్తును తప్పించుకునే ప్రయత్నం చేయలేదని తెలిపారు.

స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వాదించారు.

ఈ కేసులో పోలీసులు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, వాక్ స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తున్నారని, అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కలిగిందని తెలిపారు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories