Top Stories

కొమ్మినేని విశ్వరూపం

మీడియా రెండు ముఖాలు ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. ఒకవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా హౌస్‌లు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు వెన్నుదన్నుగా నిలిచే ఛానళ్లు, పత్రికలు. అధికారంలో ఉన్నపుడు ఈ ఛానళ్లు ప్రజల సమస్యలు మరిచిపోతాయి. అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కనిపిస్తాయి. తమకు ఇష్టమైన నాయకుడు అధికారంలో ఉంటే ఆ ప్రాంతం పరిపూర్ణంగా మారిపోయిందని భావిస్తారు. అప్పుడు ఆ మీడియా ప్రతినిధుల మనస్తత్వం కూడా పూర్తిగా సానుకూలంగా ఉంటుంది. వారికి ప్రపంచం అందంగా కనిపిస్తుంది.

కానీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత అదే ఛానళ్లు, పత్రికలు ప్రజా సమస్యలు గుర్తుచేసుకుంటాయి. ప్రాంత సమస్యలు, లోపాలు కనిపించటం మొదలవుతుంది. ప్రతిదీ వ్యతిరేక దృష్టితో చూస్తారు. చర్చా వేదికలపై మాట్లాడేటప్పుడు కోపం, నిరాశ కనిపిస్తుంది. కొన్నిసార్లు వారి నోటిలో ఊహించలేనంత ఘాటు పదాలు కూడా వస్తాయి. ఇవన్నీ ఆ వ్యక్తిగత భావోద్వేగాలే గానీ, ఆ మీడియా హౌస్ ల దృక్పథం కాదు. అందుకే అటువంటి మాటలను మీడియా సంస్థలపై మోపకూడదు. వ్యతిరేక దృష్టితో చూడకూడదు.

ఇప్పుడు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహారం కూడా అలాగే జరిగింది. ఇటీవల సాక్షి ఛానల్ డిబేట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలపై ఆయన ఇప్పటికే క్షమాపణ చెప్పాడు. “నేను తప్పుగా మాట్లాడానని అంగీకరించాను, ఇప్పుడు కూడా మళ్లీ చెబుతున్నాను” అని ఆయన తన ఛానల్‌ద్వారా స్పష్టంగా చెప్పారు. అయినా, ఆ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయంగా అతన్ని తుళ్లూరు తరలించారు.

ఈ అరెస్ట్‌పై కూడా రాజకీయ పార్టీలు వేర్వేరు స్పందిస్తున్నాయి. కూటమి నేతలు “చట్టం తన పని తాను చేసుకుంటోంది” అంటుండగా, వైసీపీ నేతలు “పత్రికా స్వేచ్ఛపై కేసులు పెడతారా?” అంటూ విమర్శిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఒకే దృక్కోణంలో చూడకూడదు. ఇది నాణానికి రెండు వాణిలాంటి అంశం.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories