కర్నూలు జిల్లాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం ఇప్పటికీ ప్రజల గుండెలను కలచివేస్తోంది. ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న ఆ బస్సులో 19 మంది సజీవదహనమయ్యారు. ఆ క్షణాలు ఎంత భయంకరంగా ఉన్నాయో ఊహించుకోవడమే కష్టం. ఆ దృశ్యాలు ఇప్పటికీ కళ్లముందు కనబడుతున్నాయి.
ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణం.. రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్ముతున్న మద్యం అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు. బైకర్ మద్యంసేవించి రోడ్డుపై పడిపోవడం.. ఆ బైక్ పై నుంచి బస్సు వెళ్లడంతో ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు పోయాయి. రోడ్లపై మద్యం మత్తులో వాహనాలు నడిపే ఘటనలు పెరిగిపోతున్నా, ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ప్రతి రోజూ మద్యం విక్రయాల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నందున అధికార యంత్రాంగం కళ్లుమూసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ విషాద ఘటనలో ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన సమయంలో, అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి, బాధ్యులను తప్పించే ప్రయత్నం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. మరణించిన వారిని సానుభూతితో చూడడం కంటే, దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పచ్చ మీడియా ముందుకొచ్చి తప్పుడు కథనాలు ప్రచారం చేసింది. అయితే నిజం బయటకు రావడంతో ఆ మాయాజాలం నిలదొక్కుకోలేకపోయింది. బాధితుల కుటుంబాలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.
ఈ సంఘటన ఒక్కరోజు వార్తగా మిగిలిపోకూడదు. మద్యం మాఫియాపై, నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని నిరపరాధ ప్రాణాలు బలవుతాయని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
ప్రజల ప్రాణాల కంటే మద్యం ఆదాయం ముఖ్యం కాదు. ఇది ప్రతి ప్రభుత్వానికి గుర్తు చేసే సమయం!
https://x.com/JaganannaCNCTS/status/1983755922339197307

