వైకాపా నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు శుక్రవారం ఊరటనిచ్చింది. ఇటీవల ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, పోసానికి బెయిల్ మంజూరు చేసింది.
గతంలో మీడియా సమావేశంలో పోసాని కృష్ణమురళి అనుచిత, అసభ్య పదజాలంతో కొందరిని దూషించారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పోసాని కృష్ణమురళి గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
తాజాగా పోసాని తన తరఫు న్యాయవాదుల ద్వారా గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఇరువైపుల వాదనలు విన్న అనంతరం పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పోసాని త్వరలో జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ పరిణామం ఆయన అభిమానులకు, వైకాపా కార్యకర్తలకు కొంత ఊరటనిచ్చే అంశం.