Top Stories

చంద్రబాబుకు మహా వంశీ ఎలివేషన్లు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మీడియా పాత్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా మహా టీవీ న్యూస్ చానల్‌లో ప్రసారమైన కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ‘మహా’ టీవీ యాంకర్ వంశీ చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

‘మహా’ టీవీ ప్రసారంలో యాంకర్ వంశీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభావాన్ని విశేషంగా వర్ణిస్తూ ఓ కథనం వినిపించారు. ఆయన చెప్పిన ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా కేంద్రంలోని బీజేపీ కేంద్రమంత్రికి ఫోన్ చేశారట.. ఆ కాల్ అందుకున్న మంత్రి వెంటనే స్పందించి, “సార్.. 5 నిమిషాలు టైం ఇవ్వండి” అని రిక్వెస్ట్ చేశారట వెంటనే అధికారులను అలర్ట్ చేసి, సమస్యను పరిష్కరించే చర్యలు ప్రారంభించారట.. 10 నిమిషాల్లో పూర్తి చేస్తామని చెప్పి, మళ్లీ కాల్ చేసి మరో 10 నిమిషాల్లో సమస్య క్లియర్ అవుతుందని వివరించారట చివరికి చంద్రబాబుకు ‘సారీ’ చెప్పి పరిస్థితి వివరించారట.. ఈ కథనం ద్వారా చంద్రబాబు ప్రభావం కేంద్ర స్థాయిలో ఎంత ఉందో చూపించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది.

ఈ వీడియో క్లిప్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు నెటిజన్లు దీనిని చంద్రబాబు నాయకత్వానికి ఉదాహరణగా ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం అతి పొగడ్తలు, జర్నలిజం విలువలు ఎక్కడ? అంటూ విమర్శలు చేస్తున్నారు.

ప్రత్యేకంగా ప్రతిపక్ష వర్గాలు, సోషల్ మీడియా యూజర్లు ఈ కథనంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇది వార్తా ప్రసారం కాదు, ప్రచారం” అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాక్ట్స్ కంటే ఫ్యాన్ మోడ్ ఎక్కువగా కనిపిస్తోంది” అంటూ విమర్శిస్తున్నారు. జర్నలిజం నిష్పాక్షికతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు

ఈ ఘటనతో మరోసారి మీడియా నిష్పాక్షికత, బాధ్యతలపై చర్చ మొదలైంది. ప్రజలకు నిజమైన సమాచారం అందించాల్సిన బాధ్యత ఉన్న మీడియా, వ్యక్తులపై అతి పొగడ్తలతో ముందుకు రావడం సరైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ కథనం ఎంతవరకు నిజమో అధికారికంగా ఎలాంటి ధృవీకరణ లేదు. సంబంధిత కేంద్ర మంత్రి లేదా ప్రభుత్వ వర్గాల నుంచి కూడా దీనిపై స్పష్టత రాలేదు. దీంతో ఇది కేవలం టీవీ చర్చల్లో వచ్చిన వాదనగా మాత్రమే మిగిలిపోయింది.

https://x.com/Samotimes2026/status/2021966380069998936?s=20

Trending today

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు...

చంద్రబాబు ‘హెరిటేజ్’పై మరో బాంబు

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెరిటేజ్...

అసెంబ్లీలో ‘నారా’ భజన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా...

అసెంబ్లీలో గోవిందా.. గోవిందా.. టీడీపీపై వైసీపీ ఎదురుదాడి!

తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ముసురుకున్న రాజకీయ దుమారం ఇప్పుడు అసెంబ్లీని...

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

Topics

అంబటిని డిప్యూటీ సీఎం చేసేదాకా వదలం అంటున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వైసీపీ నాయకుడు...

చంద్రబాబు ‘హెరిటేజ్’పై మరో బాంబు

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెరిటేజ్...

అసెంబ్లీలో ‘నారా’ భజన

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా...

అసెంబ్లీలో గోవిందా.. గోవిందా.. టీడీపీపై వైసీపీ ఎదురుదాడి!

తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ ముసురుకున్న రాజకీయ దుమారం ఇప్పుడు అసెంబ్లీని...

టీడీపీలో హాట్ టాపిక్ గా లేడీ ఎమ్మెల్యే

టీడీపీ వర్గాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు...

కాపు నేతలకు వైసీపీ ఫోన్లు.. తేలిపోయిన పవన్ బలం!

ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు కాపు సామాజిక వర్గ రాజకీయ దిశను...

‘దువ్వాడ’ బాధ అంతా ఇంతా కాదు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై నెలకొన్న వివాదం రాష్ట్ర...

కమల్ హాసన్ కు వార్నింగ్ ఇచ్చిన టీవీ5 సాంబశివరావు

కమల్ హాసన్‌పై టీవీ5 యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్...

Related Articles

Popular Categories