Top Stories

మహా న్యూస్ వంశీ కర్మ తిరగబడింది 

‘కర్మ’ సిద్ధాంతం గురించి మహాన్యూస్ ఎండీ వంశీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే ఎదురు తగులుతున్నాయని నెటిజన్లు తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడితో విలవిలలాడుతున్న మహాన్యూస్ ఛానెల్, దాని అధిపతి వంశీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు.

వంశీ తన మహాన్యూస్ ఛానెల్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్‌లపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వంశీ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఈ దాడి జరిగిన వెంటనే, గతంలో వంశీ మాట్లాడిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వంశీ, “కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఏ కాలంలో తప్పు చేస్తామో అదే కాలంలో అది 24 గంటల నుంచి 24 రోజుల్లోనే కర్మ తిరిగి తగులుతుంది. మనం తప్పు చేస్తే కర్మ ఎక్కువ కాలం ఆగడం లేదు” అని స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రస్తుతం మహాన్యూస్‌పై జరిగిన దాడి, వంశీ పరిస్థితిని ఈ పాత వీడియోతో పోలుస్తూ నెటిజన్లు వంశీని ‘టాల్కమ్ పౌడర్ వంశీ’ అంటూ తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. “ఆయన కర్మ ఆయనకే తగిలింది”, “ఇది కర్మ అంటే ఇదేనేమో” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ ఘటనతో మీడియా స్వేచ్ఛ, రాజకీయ నాయకుల తీరుపై మరోసారి చర్చ మొదలైంది. ఒక మీడియా అధిపతి గతంలో చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆయనకు ఎదురు దెబ్బగా మారడం గమనార్హం.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://x.com/Nallabalu1/status/1939326318023434616

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories