జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్, గాంధీజీ జీవితాన్ని సత్యం, అహింసల ప్రతిరూపంగా అభివర్ణించారు.
“సత్యం తాత్కాలికంగా ఓడినట్టుగా కనిపించవచ్చు.. కానీ ఎప్పటికీ ఓడదు” అనే మహాత్మా గాంధీ సందేశాన్ని గుర్తు చేసుకుంటూ, తన చివరి శ్వాస వరకు సత్యానికే అంకితమైన జీవితాన్ని గడిపిన మహనీయుడని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గాంధీజీ చేసిన త్యాగాలు, చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
జాతిపిత వర్ధంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్‌లో తెలిపారు. దేశ ప్రజలంతా గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని, సత్యం–అహింసల మార్గంలో నడవాలని ఆకాంక్షించారు.


