Top Stories

గ్రేట్ ఆంధ్రా మూర్తి పై కంప్లైంట్.. షాకిచ్చిన మంచు లక్ష్మి

టాలీవుడ్ నటి మంచు లక్ష్మి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ వెబ్ మీడియా గ్రేట్ ఆంధ్రా జర్నలిస్ట్ వీ.ఎస్‌.ఎన్. మూర్తిపై ఆమె ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటర్వ్యూలో తనను అడిగిన కొన్ని ప్రశ్నలు తన గౌరవాన్ని దెబ్బతీసాయని ఆరోపిస్తూ, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మంచు లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, జర్నలిస్ట్ మూర్తి తన వయసు, వేసుకునే దుస్తులపై ప్రశ్నలు అడిగారని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. “అది జర్నలిస్టిక్ ఇంటర్వ్యూ కాదు, నేరుగా వ్యక్తిగత దాడి. ఇది గౌరవం తక్కువ చేసే ప్రయత్నం. కేవలం వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారు” అని ఆమె అన్నారు.

జర్నలిజం పట్ల తనకున్న గౌరవాన్ని గుర్తు చేసిన మంచు లక్ష్మి, “అన్ని మీడియా వ్యక్తుల పట్ల నాకు గౌరవం ఉంది. కానీ ఇలాంటి వ్యక్తిగత దాడులు సహించలేను. మేల్ డామినేట్ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి నాకు ఒక గుర్తింపు సంపాదించుకున్నాను. ఇలాంటి ప్రవర్తనను మౌనంగా వదిలేస్తే, ఇది మళ్లీ మళ్లీ జరుగుతుంది” అని వ్యాఖ్యానించారు.

తనపై జరిగిన ఈ ప్రవర్తనపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్‌ను కోరుతూ ఆమె ఫిర్యాదు చేశారు. మహిళల గౌరవాన్ని కాపాడే దిశగా ఈ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

టాలీవుడ్‌లో ఇప్పటివరకు జర్నలిస్టులపై ఇలాంటి ఫిర్యాదులు చాలా అరుదుగా వెలువడిన విషయం తెలిసిందే. మంచు లక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

https://x.com/TeluguScribe/status/1969058746845503834

Trending today

రఘురామ కృష్ణం రాజుపై పీవీ సునీల్ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్...

పవన్ కు అంబటి సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి...

పవన్ ను బీజేపీ వదిలేస్తోందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు...

మోడీ, బాబు, పవన్ ను తిట్టండి.. నా జోలికి రావద్దు

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

గాడితప్పిన ‘బాబు’ పాలన..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే పాలనపై విమర్శలు మొదలయ్యాయి....

Topics

అడ్డంగా బుక్కైన నారా లోకేష్

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ ప్రాంతంలో ఎకరా భూమిని కేవలం 99...

విమానంలో జగన్ కు ఊహించని సర్ ప్రైజ్.. వీడియో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ముందుగానే మొదలయ్యాయి. డిసెంబర్...

బిజెపిని ఫాలో అవుతున్న పవన్ కళ్యాణ్!

భారతీయ జనతా పార్టీ ఎదుగుదలలో అనుబంధ సంఘాల పాత్ర ఎంత కీలకమో...

Related Articles

Popular Categories