సినీ నటి మంచు లక్ష్మిపై ఇంటర్వ్యూలో అనుచిత ప్రశ్నలు అడిగిన సీనియర్ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి చివరికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. దక్ష సినిమా ప్రమోషన్ సమయంలో ఆమె దుస్తులపై వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
మంచు లక్ష్మి ఈ వ్యవహారంపై ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేస్తూ, క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. మూడు వారాల తర్వాత మూర్తి లేఖ, వీడియో ద్వారా క్షమాపణ తెలిపారు.
దీనిపై మంచు లక్ష్మి స్పందిస్తూ, “నాకు కావల్సింది నిజమైన క్షమాపణ మాత్రమే. నా కోసం నేనే నిలబడకపోతే నా కోసం ఎవరూ నిలబడరని నమ్ముతున్నాను. మహిళల స్వరం నిశ్శబ్దం కాకుండా ఉండాలి” అని అన్నారు.
సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మంచు లక్ష్మికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఘటన మహిళల గౌరవం, మీడియా బాధ్యతపై చర్చకు దారితీసింది.