మంచు ఫ్యామిలీలో విభేదాలు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మోహన్‌బాబు, మంచు మనోజ్ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఆస్తి వ్యవహారాల్లోనే తండ్రీ కొడుకుల మధ్య గొడవ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
తనతో తండ్రి మోహన్‌బాబు దాడి చేశాడని మంచు మనోజ్ పహాడి షరీష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తన భార్య మౌనికపై మోహన్‌బాబు దాడిచేశాడని మనోజ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. గాయాలతోనే మనోజ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మనోజ్ తనపై దాడిచేసినట్లు మోహన్‌బాబు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు సమాచారం.