Top Stories

బాబును లాజిక్‌తో కొట్టిన మందుబాబు.. మాటలు వింటే నవ్వకుండా ఉండలేరు

ఏపీలో మందుబాబు ఫుల్‌గా చిల్‌ అవుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెరగడంతో మందులు తాగి చిందులేస్తున్నారు. ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలతో రాష్ట్రం మూడు సీసాలు, ఆరు క్వార్టర్లు చందంగా విరాజిల్లుతోంది. మద్యం అమ్మకాలకు అనుగుణంగానే మందుబాబులు తాగి చెలరేగిపోతున్నారు. తాజాగా మందు తాగి బండి నడుపుకుంటూ వెళుతున్న ఒక మందుబాబును పోలీసులు ఫైన్‌ విధించారు. దీంతో సదరు మందుబాబు ఆ పోలీసులకు చుక్కలు చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే. మందేసి బైక్‌ నడుపుతున్న వ్యక్తిని ఆపిన పోలీస్‌.. ఎవరికైనా దెబ్బ తిగిలితే ఏమిటంటూ ప్రశ్నించారు.

దానికి సదరు మందుబాబు.. తగిలితే తగుల్దాది సార్‌ అంటూ సమాధానం ఇచ్చాడు. బండికి అడ్డం వస్తే తగులుతుందని, లేకపోతే నా ఇంటికి నేను వెళ్లిపోతనంటూ సమాధానం చెప్పాడు. దీనికి తాగి బండి నడపడం నేరం కాదా.? అని ప్రశ్నించగా.. దానికి సదరు మందుబాబు పోలీసులకు చుక్కలు చూపించేలా సమాధానం చెప్పాడు. తాగి బండి నడపడం నేరమే సార్‌ అంటూ సమాధానం చెబుతూ.. అమ్మేటోడిది నేరం అని మాత్రం చెప్పడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. లంచం తీసుకోవడం నేరమని తెలిసినా మరెందుకు లంచం తీసుకుంటున్నారంటూ పోలీసును ప్రశ్నించాడు. హెల్మెట్‌ లేకపోతే రెండొందలు, ఆర్‌సీ బుక్‌ లేకపోతే మూడొందలు, ట్రిపుల్‌ రైడింగ్‌ అయితే ఆరొందలు అంటూ దొబ్బేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీనికి సదరు పోలీసు అధికారికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన ఎంతో మంది సీఎం చంద్రబాబును గట్టి లాజిక్‌తోనే కొట్టారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories