మాసబ్ ట్యాంక్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ సోదరుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ఈగల్ టీమ్‌తో పాటు మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవల ట్రూప్ బజార్‌కు చెందిన ఇద్దరి అరెస్టుతో డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడగా, విచారణలో నటి సోదరుడి పేరు తెరపైకి వచ్చింది. గతంలో కూడా అతడు సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్టు సమాచారం. ప్రస్తుతం మొబైల్ డేటా, సీసీటీవీ ఆధారంగా ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.


