అగ్నిపరీక్ష నాల్గో ఎపిసోడ్‌లో మాస్క్ మ్యాన్ హరీష్, దమ్ము శ్రీజా తమ ధైర్యంతో ప్రత్యేకంగా నిలిచారు. మాస్క్ మ్యాన్ తన ముఖానికి సగం గడ్డం ట్రిమ్ చేసుకోవడం ద్వారా టాప్ 15లో చోటు దక్కించుకున్నాడు. ఇక దమ్ము శ్రీజా, “ఐ యామ్ ది లూజర్” టాటూ వేయించుకోవడానికి కూడా సిద్ధమై తన గేమ్ పట్ల ఉన్న ప్యాషన్ చూపించింది. చివరికి టెస్టింగ్ టాస్క్‌గా చేతిపై “ఐ లవ్ బిగ్ బాస్” టాటూ వేసుకొని టాప్ 15లోకి చేరింది. వీరిద్దరి నిర్ణయాలు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి.