ఇటీవల సోషల్ మీడియాలో “మెగా బ్రదర్స్” మధ్య విభేదాలు చెలరేగాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఈ ముగ్గురు సోదరులు తెలుగు సినిమా, రాజకీయ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందినవారు. వారిమధ్య ఎప్పుడూ స్నేహపూర్వక బంధమే కొనసాగుతుందని సన్నిహితులు చెబుతున్నారు.
కొంతమంది సోషల్ మీడియా వేదికలపై చిరంజీవి జగన్‌కు మద్దతు ఇస్తారనే పోస్టులు పెడుతూ గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి జగన్ కు సానుకూలంగా మాట్లాడడం.. ఆయన మీటింగ్ కు పిలిచినప్పుడు అవమానించలేదని క్లారిటీ ఇవ్వడంతో పవన్, నాగబాబుకు మింగుడు పడడం లేదు. దీంతో చిరుకు, పవన్, నాగబాబుకు మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు. అయితే మెగా కుటుంబ వర్గాలు ఈ వార్తలను పూర్తిగా ఖండించాయి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు తమ్ముళ్లు రాజకీయంగా ఎదగడంపై చిరంజీవి సంతోషంగా ఉన్నారని సమాచారం.
మొత్తానికి, “మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు” అనేది లోలోపల జరుగుతున్న తంతు అని అది బయటకు రాదు అని అంటున్నారు.. నిజానికి వారు ఒక కుటుంబం, ఒక అనుబంధంతో ఉన్నారు.

