అనంతపురంలో ఓ పోలీసుపై మంత్రివర్గ సభ్యుడి సోదరుడు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సోదరుడు బీసీ మదన్ భూపాల్ రెడ్డి, విధి నిర్వహణలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌ను బూతులు తిట్టి, చెంపపై కొట్టిన దృశ్యాలు వీడియో రూపంలో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై ప్రజాసంఘాలు, పోలీసు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. “ఇది శాంతియుత పాలన అంటున్న కూటమి ప్రభుత్వం నిజస్వరూపమా?” అంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్టు సమాచారం. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు, వీడియో ఆధారంగా త్వరలోనే చర్యలు తీసుకోనున్నారు.