Top Stories

జగన్‌పై అలిగితే ఇలానే ఉంటుంది.. షేక్ చేస్తోన్న వీడియో

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కీలక పదవులను అనుభవించి, గౌరవాన్ని పొందిన ఎంతో మంది నాయకులు గడిచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ మారిపోయారు. జగన్మోహన్‌రెడ్డితోపాటు పార్టీ ఎంతో గౌరవాన్ని కల్పించడంతోపాటు పదవులను అందించింది. అయితే, వ్యక్తిగత స్వలాభం కోసం పలువురు పార్టీని వీడి వెళ్లిపోయారు. వీరిలో కొందరు. టీడీపీలో చేరగా, మరికొందరు జనసేనలో చేరారు. అటువంటి నేతలంతా ఇప్పుడు ఆయా పార్టీల్లో తీవ్రమైన అవమానాలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజులు కిందట జరిగిన సమావేశంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని తీవ్రస్థాయిలో అవమానించేలా ప్రకాశం జిల్లాకు చెందిన కూటమి నేతలు వ్యవహరించగా, ఇప్పుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి అటువంటి పరిస్థితే ఎదురైంది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొద్దిసేపు కూర్చుని ఒక్కసారిగా కోపంతో బయటకు వెళ్లిపోయారు.

ఆయన వెంట మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా పరుగున వెళ్లారు. స్పీడ్‌గా వెళ్లి కారు ఎక్కిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోపంతో ఊగిపోయారు. ఇటువంటి మీటింగ్లకు తానెప్పుడూ హాజరుకాబోనంటూ స్పష్టం చేశారు. కనీసం గౌరవం ఇవ్వకుండా మీటింగ్లు నిర్వహిస్తారా..? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన.. ఇంకెప్పుడు ఇటువంటి సమావేశాలకు రాబోనంటూ స్పష్టం చేసి వెళ్లిపోయారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆయన్ను బతిమిలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. కారు ఎక్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. జగన్‌పై అలిగి వెళ్లిన నేతలకు సరైన గౌరవమే దక్కుతోందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అలిగితే అట్టూ ఉండదు, ముక్క ఉండదూ అన్న చందంగా ఇప్పుడు వైసీపీ నుంచి వెళ్లిన నాయకులు పరిస్థితి తయారైందంటూ పలువురు సామాజిక మాధ్యమాలు వేదికగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో జోరుగా వైరల్‌ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడండి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories