టాలీవుడ్లో శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు భూకంపం సృష్టించాయి. అమ్మాయిలు సాయన్లు కనిపించే డ్రెస్లు వేసుకోవద్దని చెప్పిన ఆయన మాటలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. హీరోయిన్లు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తుంటే, మద్దతుదారులు కూడా లేకపోలేదు.
ఇక తాజాగా ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (ప్రపంచ యాత్రికుడు) ఈ విషయంపై తన ఛానల్లో స్పందించాడు. శివాజీ వ్యాఖ్యలను పూర్తిగా తప్పుపట్టి, అనసూయకు పూర్తి మద్దతు తెలిపాడు. గతంలో గరికపాటి నరసింహారావు అమ్మాయిల వస్త్రధారణపై చేసిన కామెంట్లను కూడా టార్గెట్ చేశాడు.
‘గుడ్డ ముక్కలు విప్పుకొని తిరగండి.. స్వేచ్ఛ ఇంపార్టెంట్, సేఫ్టీ ఇంపార్టెంట్!’ అంటూ అన్వేషణ ఇచ్చిన కౌంటర్ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై విమర్శలు, మద్దతులు పెరుగుతున్నాయి. శివాజీ వివాదం ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది.

