ఎల్లోమీడియాకు నాగబాబు కౌంటర్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎల్లోమీడియాకు ఎవ్వరూ ఊహించని కౌంటర్ ఇచ్చాడు.. ఈ మేరకు నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. తనకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదని నాగబాబు అన్నారు.

గత కొద్ది రోజులుగా పవన్ ఢిల్లీ పర్యటన గురించి ఏదో ప్రచారం చేస్తున్న యెల్లోమీడియాకు నాగబాబు ఈరకంగా షాక్ ఇచ్చాడు. పవన్ ఢిల్లీ పర్యటనను నాగబాబుకు అంకితమిస్తున్నట్లు ఎల్లోమీడియా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.

పవన్ తన పర్యటనలో నాగబాబుకు రాజ్యసభ సీటు ఇవ్వాలని బీజేపీ నేతలను కోరినట్లు ఎల్లోమీడియా పేర్కొంది. ఈ ప్రచారంతో నాగబాబు ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. మాజీలో పరిస్థితిని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే నాగబాబు తనకు కౌంటర్లు పడకుండా వెంటనే కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేయడం విశేషం. ఒకవేళ పవన్ తన అన్న సీటు కోసం ప్రయత్నిస్తే అది నెరవేరితే ట్రోల్స్ చేస్తారనే ఈ కామెంట్స్ సెక్షన్ ఆఫ్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఇది పూర్తిగా ఎల్లో మీడియాకు కౌంటర్ ఇవ్వడానికే నాగబాబు ఇలా చేసినట్టుగా అర్థమవుతోంది.