Top Stories

డిప్యూటీ సీఎంనే బెదిరించిన నారా లోకేష్

బెంగళూరుకు చెందిన బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేష్ యాబాజీ, తమ నగరంలోని రోడ్ల దుస్థితిపై ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. రాజేష్ యాబాజీ తన ట్వీట్‌లో, బెంగళూరులో గంటన్నర ప్రయాణ సమయం, రోడ్లపై గుంతలు, దుమ్ము కారణంగా తమ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, దీని వల్ల తాము వేరే ప్రాంతానికి వెళ్లాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ట్వీట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ ట్వీట్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, రాజేష్ యాబాజీని తమ కంపెనీని విశాఖపట్నానికి మార్చాలని ఆహ్వానించారు. విశాఖపట్నం దేశంలోనే పరిశుభ్రమైన నగరాలలో ఒకటని, మంచి మౌలిక సదుపాయాలు, మహిళలకు భద్రత ఉన్న నగరమని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఈ రకమైన బెదిరింపులు, బ్లాక్ మెయిల్ లకు తమ ప్రభుత్వం లొంగదని, బెంగళూరు రోడ్ల మరమ్మత్తుల కోసం ఇప్పటికే రూ.1100 కోట్లు కేటాయించిందని తెలిపారు. నవంబర్ నాటికి రోడ్ల మరమ్మత్తులను పూర్తిచేయడానికి గడువు విధించామని కూడా ఆయన వివరించారు.

డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏకంగా బెదిరించేశారు.  “మిగిలిన రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న తేడా అదే. మా ప్రజల నిజమైన సమస్యలను బ్లాక్ మెయిల్ గా కొట్టిపారేయలేం. వాటిని మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం,” అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఈ కొత్త రాజకీయ వివాదం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://x.com/naralokesh/status/1968643373025182078

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories