ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ.. మీడియా ఎలివేషన్లు కూడా హీట్ పెంచుతున్నాయి. తాజాగా టీవీ5 యాంకర్ సాంబశివరావు గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్‌కు కారణమయ్యాయి. మంత్రి నారా లోకేష్‌ను క్రీడాకారుడు తిలక్ వర్మతో పోల్చిన సాంబ గారి వ్యాఖ్యలు నెటిజన్లకు నవ్వులు పూయించాయి.
టీవీ5లో ప్రసారమైన ఒక కార్యక్రమంలో సాంబశివరావు మాట్లాడుతూ “ఏపీ మంత్రి నారా లోకేష్ చాలా ఒత్తిడిని ఎదుర్కొని, చివరికి విజయవంతమైన మంత్రిగా నిలిచారు. ఆయన ప్రోత్సాహం వల్లే తిలక్ వర్మ ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్‌పై అద్భుతంగా ఆడాడు”
అని వ్యాఖ్యానించారు.
ఇదే వాక్యం సోషల్ మీడియాలో “ఎందుకూ సాంబన్న… మా మీద నీకు అంత పగ?” అంటూ వైరల్ అవుతోంది. నెటిజన్లు “లోకేష్ సపోర్ట్ లేకుంటే తిలక్ వర్మ బ్యాట్ ఎత్తేవాడా?” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో టీవీ5 సాంబా వ్యాఖ్యలపై జోకులు వెల్లువెత్తుతున్నాయి. “తర్వాత సాంబన్న చెబుతాడు… విరాట్ కోహ్లీ కూడా లోకేష్ ప్రేరణతోనే శతకం కొట్టాడని!” “లోకేష్ ప్రోత్సాహం లేకుంటే తిలక్ వర్మ బంతి చూడకుండానే ఔటయ్యేవాడట!” అంటూ సరదాగా మీమ్స్ చేస్తున్నారు.
తిలక్ వర్మ హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్. అతను భారత జట్టులో మెరుస్తూ, ఫైనల్లో పాకిస్తాన్‌పై అద్భుత బ్యాటింగ్‌తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు. అయితే టీవీ5 సాంబశివ గారు చేసిన వ్యాఖ్యలతో ఆ విజయానికి రాజకీయ కోణం ఇవ్వడం నెటిజన్లను విసిగించింది.
మొత్తానికి, ఒక క్రీడాకారుడి ప్రతిభను రాజకీయ లింక్‌తో కలపడం సాంబశివకు చేదు అనుభవం ఇచ్చింది. ఇప్పుడు నెటిజన్ల నోళ్లలో ఒక్కటే మాట “సాంబన్న… నీ ఎలివేషన్లు కొంచెం ఎక్కువయ్యాయ్ బాస్!”

