Top Stories

లోకేష్ vs అమర్ నాథ్

ఏపీలో పొలిటికల్ పంచ్ లు మామూలుగా లేవు. నేతలు ఒకరినొకరు రాగింగ్ చూసుకుంటున్నారు. అప్పట్లో మాకు ఇలా అంటారా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి అని కొత్త పేర్లు పెడుతున్నారు. ‘తొందరెందుకన్న’ అన్న అనిల్ కుమార్ యాదవ్ మాటలను.’కోడి ముందా.. గుడ్డు ముందా’ అన్న గుడివాడ అమర్నాథ్ మాటలను కూటమి నేతలు ఏ రేంజ్ లో విరుచుకుపడేవారు తెలిసిందే. అయితే తాజాగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ప్రచారంలో ‘ నీకు 15 వేలు, నీకు 15 వేలు’ అన్న కామెంట్స్ పై విపరీతంగా టార్గెట్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. చివరకు జగన్మోహన్ రెడ్డి సైతం దీనిపై వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా తనపై గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్.

వైసిపి హయాంలో ఎక్కువగా ట్రోల్ కు గురైంది మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ . ఐటీ శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ అప్పట్లో దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఏపీలో పెట్టుబడుల గురించి ప్రశ్నిస్తే.. కోడి ముందా? గుడ్డు ముందా? అని తిరిగి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురయ్యారు. అయితే గతంలో ఇదే గుడివాడ అమర్నాథ్ పై స్పందించారు లోకేష్. అప్పట్లో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఉద్దేశించి మాస్ ర్యాగింగ్ చేశారు. యువ గళం పాదయాత్ర ముగింపు వేడుకల్లో గుడ్డు మంత్రి అంటూ అమర్నాథ్ ను ఉద్దేశించి హేళన చేశారు.

అయితే తాజాగా మంత్రి లోకేష్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ అమర్నాథ్. శోభనం లోకేష్ అంటూ కామెంట్ చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తానని లోకేష్ ప్రకటించారని.. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని.. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇప్పుడు అడిగితే ‘శోభనం కాగానే పిల్లలు పుడుతారా? అని ప్రశ్నిస్తున్నారని.. మాట నిలుపుకోలేని లోకేష్.. శోభనం లోకేష్ అని తాను అంటున్నానని.. ఇకనుంచి అలానే పిలుస్తానని ప్రకటించారు. దీంతో ఇదిప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘శోభనం లోకేష్’ అంటూ అందరూ ట్రోల్స్ చేస్తున్నారు.

వీడియో

https://x.com/GraduateAdda/status/1939678559418634487

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories