Top Stories

అడ్డంగా బుక్కైన నారా లోకేష్

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ ప్రాంతంలో ఎకరా భూమిని కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ కంపెనీకి కేటాయించడంపై కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలపాలైంది. 27 ఎకరాలకు పైగా భూమిని రహేజా కార్ప్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కీలక ప్రశ్నలు సంధించింది. ఇంత తక్కువ ధరకు, అది కూడా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు ఇవ్వడం రాష్ట్ర ప్రయోజనాలకు ఎలా దోహదపడుతుందో వివరించాలని కోర్టు నిలదీసింది.

ఈ వ్యవహారం కోర్టులో చిక్కుల్లో పడటంతో మంత్రి నారా లోకేష్ రాజకీయ విమర్శలకు దిగారు. పెట్టుబడులు, ఉద్యోగాలను వైఎస్ జగన్ అడ్డుకుంటున్నారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. కానీ అసలు ప్రశ్నలు వేయాల్సింది ప్రతిపక్షాన్ని కాదు, కోర్టు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూకేటాయింపుతో పాటు ప్రభుత్వమే కంపెనీకి కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటంపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.

యువత ఉద్యోగాల పేరుతో కారుచౌకగా విలువైన భూములు కార్పొరేట్లకు అప్పగించడం సమంజసమేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయ విమర్శలకన్నా కోర్టులో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత లోకేష్‌పైనే ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Trending today

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

Topics

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

ఆ ఎమ్మెల్యేల దుకాణం పెద్దది.. రాసలీలలు ఎన్నో?

రైల్వేకోడూరు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ 'రాసలీలల'...

Related Articles

Popular Categories