Top Stories

జగన్ ‘అసెంబ్లీ’ ఫైట్.. కాచుకో బాబు

చంద్రబాబుతో అసెంబ్లీలోనే తేల్చుకోవాలని జగన్ రెడీ అయ్యాడు. గవర్నర్ ను, చంద్రబాబును అసెంబ్లీలోనే కడిగేసి నిరసన గళం వినిపించాలని సిద్ధమయ్యారు. ఈ మేరకు రాబోయే వర్షకాల అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ‘అసెంబ్లీ’ ఫైట్ కు రెడీ అయ్యారు.

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ ఎన్నికల్లో కూటమి 164 సీట్లు సాధిస్తే విపక్ష వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తొలి అసెంబ్లీ సమావేశానికి వైఎస్ జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయక తప్పదు కాబట్టి ఆ సమావేశానికి హజరైన జగన్… ప్రమాణం పూర్తి కాగానే ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు రెండో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. దీనికి జగన్ హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.

రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, చిన్నారులపై అత్యాచారాలపై విపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను కత్తితో నరికి చంపేశారు. దీంతో ఇవాళ వినుకొండ వెళ్లి మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన జగన్…అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై స్పష్టత ఇచ్చారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరుకానున్నట్లు జగన్ వెల్లడించారు.

జూలై 22న సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు ఉభయసభల్ని ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైఎస్ జగన్ హెచ్చరించారు. ఆ తర్వాత రోజు ఢిల్లీకి తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి నిరసన చేపడతామని జగన్ తెలిపారు. అయితే గతంలో తొలి సెషన్ సందర్భంగా కూడా జగన్ మొదటి రోజు హాజరై ఆ తర్వాత తిరిగి అసెంబ్లీకి వెళ్లలేదు. ఈసారి కూడా తొలి రోజు మాత్రమే జగన్ హాజరై అదీ గవర్నర్ ప్రసంగం అడ్డుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories