Top Stories

అయ్యో పాపం అనిత.. సోషల్ మీడియాలో సెటైర్లు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి అనితను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపు తప్పాయని, అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయకుండా కులం చూస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే తాను హోం శాఖ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకరకంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశించే చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయ్యో పాపం అనిత అంటూ పలువురు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు నోటి దురుసు అనితకు అలానే ఉండాలంటూ మరికొందరు చురకలు అంటిస్తున్నారు. హోం మంత్రి అనితకు పని తక్కువ, మాటలు ఎక్కువ అంటూ పలువురు ట్రోల్ చేస్తుండగా.. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా కన్ఫామ్ చేశారంటూ మరికొందరు పేర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ అనితను అంత దారుణంగా తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పవన్ వ్యాఖ్యల తర్వాత అనిత పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా అనిపిస్తోందని వైసీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింత పేర్కొన్నారు. హోంమినిస్టర్ హోమ్ లోనే కూర్చొని ఏడుస్తూ కూర్చుని ఉంటారంటూ ఆయన వ్యాఖ్యానించారు. దారుణంగానే పాలను సాగిస్తున్నారని, చండాలంగానే పరిపాలన సాగిస్తున్నారని విషయం అందరికీ తెలుసని, కానీ ఈ పాలనలో అనిత పాత్ర ఎటువంటిదో పవన్ కళ్యాణ్ కు తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి తయారైందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీరు అద్వానంగా ఉన్న విషయం అందరికీ తెలుసని, ఇందులో పవన్ కళ్యాణ్ బాధ్యత కూడా ఉందని, కానీ అనితను బ్లేమ్ చేసేలా పవన్ మాట్లాడిన మాటలు వెనుక అనితను బద్నాం చేసే కుట్ట దాగి ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. డాక్టర్ చింత ప్రదీప్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories