ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ తీవ్ర వాదోపవాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవిష్యత్తుపై తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రభుత్వం నడపాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించడం ఎలాంటి పరిపాలన అని ప్రశ్నించిన ఆయన, “ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఏం తేడా?” అని నిప్పులు చెరిగారు. ఒక మాటతోనే సీఎం చంద్రబాబు పరువు తీసినట్టయ్యాడని విమర్శించారు.
పేదల కోసం ఉన్న ఆసుపత్రులే ప్రైవేటుకు?
వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రైవేటుకు అప్పగిస్తే, పేదల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? అని ప్రశ్నించారు.మరోవైపు అమరావతి నిర్మాణం కోసం మాత్రం వేల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్న బాబు, పేదల వైద్యం కోసం నిధులు లేవనడం సిగ్గు చేటు అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఈ వ్యాఖ్యలతో వైసీపీ –టిడిపి మధ్య మళ్లీ వాగ్వాదం రగిలే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ వర్గాలు “ప్రజా ప్రయోజనాలు పక్కనబెట్టి, ప్రైవేటు లాబీయిస్టుల కోసం నిర్ణయాలు తీసుకోవడం చంద్రబాబు స్వభావం” అని విమర్శిస్తుండగా, టిడిపి వర్గాలు మాత్రం దీనిపై బదులిచ్చే అవకాశముంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించడం పై కారుమూరు వెంకటరెడ్డి సూటి వ్యాఖ్యతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఒక్క మాటతోనే బాబు పరువుతీసేలా చేసిన ఈ విమర్శపై, ఇప్పుడు టిడిపి నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.