Top Stories

పవన్ హాసన్.. వైరల్ వీడియో

 

మొన్నటివరకు చంద్రబాబు నాయుడు రిటైర్ అవ్వాలని సూచించిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా చంద్రబాబు వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. “దేశానికి మోదీ మూడోసారి ప్రధాని అయ్యినట్టు…చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం అవ్వాలి. చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారం రేపుతున్నాయి.

గతంలో చంద్రబాబు వయసు మీద పడిందని, ఆయన తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనపై తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “నిన్న మొన్నటి వరకు రిటైర్మెంట్ ఇవ్వమన్నారు.. ఇప్పుడు ఏకంగా హ్యాట్రిక్ కొట్టమంటున్నారు.. ఇది కదా రాజకీయమంటే!” అంటూ ఒక నెటిజన్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

మరో నెటిజన్ అయితే పవన్ కళ్యాణ్ మాట మార్చడంలో కమల్ హాసన్‌ను కూడా మించిపోయారని ఎద్దేవా చేశారు. “కమల్ హాసన్ కూడా ఇంతలా మాట మార్చి ఉండరు.. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు” అంటూ కామెంట్ పెట్టారు.

కొందరు నెటిజన్లు అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయకత్వం అవసరమని అభిప్రాయపడుతున్నారు. అయితే, మెజారిటీ నెటిజన్లు మాత్రం పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

“నాలుక మడత పెట్టడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా” అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మీమ్స్, జోక్స్ రూపంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మొత్తానికి, పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు ఆయన రాజకీయ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన మలుపుగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆయన అభిమానులను, రాజకీయ విశ్లేషకులను ఏ మేరకు మెప్పిస్తాయో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో మాత్రం పవన్ కళ్యాణ్ ట్రోలింగ్ మెటీరియల్‌గా మారిపోయారు.

వీడియో

Trending today

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Topics

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

మహిళపై జనసేన ఎమ్మెల్యే కీచకపర్వం

మహిళల పక్షాన పోరాడే నాయకుడిగా పేరున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్...

యెల్లో మీడియా ఆక్రందన… అరణ్య రోదన!

తెలుగు మీడియా రంగం రోజురోజుకీ విలువలు కోల్పోతుందా? లేక రాజకీయ ప్రయోజనాల...

దావోస్‌ దారి ఖర్చులూ రాలేదా ఫాఫం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక...

Related Articles

Popular Categories