జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలకీ, పనులకీ మధ్య తేడా ఉందని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు పంట నష్టానికి రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వచ్చిన మెంతా తుఫాన్ విషయంలో మాత్రం నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో పవన్ కళ్యాణ్ “రైతులే ఈ దేశానికి వెన్నెముక” అంటూ పలు సభల్లో గర్జించారు. ప్రతి రైతు నష్టాన్ని ప్రభుత్వం భరించాలంటూ తీవ్రంగా మాట్లాడారు. అయితే, ఇప్పుడు తుఫాన్ ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు నాశనం అయ్యి రైతులు ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం ప్రజలను నిరాశపరుస్తోంది.
పవన్ కళ్యాణ్ గతంలో అడిగినట్లుగా ఇప్పుడు కూడా ఎకరానికి రూ.25 వేలు పరిహారం ప్రకటిస్తారా? అనే ప్రశ్న ప్రతి రైతు నోట వినిపిస్తోంది.
అయితే, మరోవైపు పవన్ కళ్యాణ్ తాజాగా తన సినిమా టికెట్ ధరలు రూ.1000కి పెంచాలని కోరిన విషయం పెద్ద వివాదానికి దారితీసింది. సినీ టికెట్ ధరల పెంపు విషయానికే అంత ఆసక్తి చూపి, రైతుల నష్టపరిహారంపై మౌనం పాటించడం ఆయన రాజకీయ నిబద్ధతను ప్రశ్నించేలా ఉందని విమర్శకులు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రజల, ముఖ్యంగా రైతుల తరఫున నిలబడతారు? మాటలు కాదు, చర్యలతో నిరూపించే సమయం ఇది అని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.


