Top Stories

బాలినేని విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేనికి సరైన గౌరవం దక్కడం లేదనే ప్రచారం ఇటీవల బలంగా నడిచింది. ఒంగోలులో జనసేన నేతలు కూడా ఆయన చేరికను పెద్దగా అంగీకరించకపోవడంతో, ఆయన తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో బాలినేనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, పార్టీని బలోపేతం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో ప్రభావం చూపించగలిగే నేతగా బాలినేనికి పేరుంది. ఆయనకు ఎమ్మెల్సీ హోదా కల్పిస్తే, జనసేన తరఫున మరింత బలంగా గళం వినిపించే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా, బాలినేనితో కలిసి పనిచేసిన నేతలు చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చ్చి బాలినేనికి మద్దతుగా జనసేన వైపు టచ్‌లోకి వస్తారని పవన్ కళ్యాణ్ పగటి కలలు కంటున్నారట… కానీ జగన్ అభిమానులు, నేతలు ఎవరూ కూడా కనీసం బాలినేని పట్టించుకోడం లేదు. ఆయన పడిపోయిన స్థాయిని గుర్తించడం లేదు. వైసీపీలోచెల్లని రూపాయిని పవన్ జనసేనలో చెల్లేలా చేయాలని చూస్తున్నాడు. ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

మరి ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవం అవుతుంది, పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎంతమేరకు ఫలితాలు ఇస్తాయి అనేది చూడాలి.

Trending today

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

Topics

జగన్ నినాదాలు చేయడం నేరమైపోయిందా?

ఖమ్మం జిల్లాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్...

ఏపీలో మందుబాబుల కడుపు కొట్టిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మద్యపాన ప్రియులకు షాక్...

చంద్రబాబు, రేవంత్, పవన్, కేసీఆర్, జగన్ కలిసి పండుగ చేస్తే.. వీడియో వైరల్

తెలుగు రాజకీయాల్లో ఎప్పుడూ కనిపించే తీవ్ర విభేదాలకు పూర్తిగా భిన్నంగా, తాజాగా...

చంద్రబాబు స్కిల్‌ స్కామ్‌ కేసు క్లోజ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్‌ స్కామ్‌...

చంద్రబాబుపై పవన్ స్వామి ‘భక్తి’ పీక్స్

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం...

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

Related Articles

Popular Categories