బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేకమంది జాతీయ నేతలు హాజరవుతున్నారు. ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానాలు అందాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్లలేదు? ఆయనకు ఆహ్వానం అందలేదా? లేక వ్యూహాత్మకంగానే గైర్హాజరు అయ్యారా? అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జనసేన – టిడిపి – బీజేపీ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. బీజేపీతో అనుబంధాలు సద్దుమణిగిన సమయంలో టీడీపీని మళ్లీ ఎన్డీఏలోకి తీసుకురావడంలో పవన్ చొరవ అందరికీ తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయన దూకుడు ఎన్డీఏ విజయానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీంతో పవన్ ప్రభావం జాతీయస్థాయిలో కూడా పెరిగింది.
ఇలా ఉన్న పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్లకపోవడం, ప్రమాణ స్వీకార వేడుకకు కూడా హాజరు కానట్టుగా కనిపించడం ప్రశ్నార్ధకమైంది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలన్నింటికీ ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. పవన్‌కు కూడా ఆహ్వానం వెళ్లే అవకాశముంది. అయినప్పటికీ ఆయన వెళ్లకపోవడం రాజకీయ వ్యూహంలా కనిపిస్తున్నదని విశ్లేషకుల అభిప్రాయం.
ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా పాలనపై దృష్టి పెట్టారు. సచివాలయంలో రోజూ సమీక్షలు, శాఖల పనితీరుపై కఠినమైన పర్యవేక్షణ… ఇవన్నీ ఆయనకు ఇప్పుడు ప్రధాన ప్రాధాన్యాలుగా మారాయి. అయినా కూడా, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారాలకు వెళ్లిన పవన్ బీహార్ విషయంలో మౌనంగా ఉండటమే అనేక అనుమానాలకు కారణమైంది.
పవన్‌కు ఆహ్వానం రాలేదా? రాగా వెళ్లలేదా? లేదా ఇది ఒక రాజకీయ సైలెంట్ స్ట్రాటజీా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ ఈ అంశం చుట్టూ సృష్టమైన చర్చ మాత్రం వేడి చేసింది!


