Top Stories

సుగాలి ప్రీతి చెల్లి కన్నీరు.. పవన్ వినండి

సుగాలి ప్రీతి’ కేసు మరోసారి రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోసం సుగాలి ప్రీతి తల్లి, చెల్లి రోడ్డెక్కి ధర్నా చేయగా, వారి ఆవేదన అందరి హృదయాలను కదిలించింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదని ఆ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ధర్నా సందర్భంగా సుగాలి ప్రీతి చెల్లి మాట్లాడిన మాటలు కంటతడి పెట్టించాయి. “పవన్ కళ్యాణ్ మామ ఆరోజు మీ ఆఫీసుకొచ్చినప్పుడు చెప్పావు కదా న్యాయం చేస్తానని… మరి మేము ఎందుకు ఇన్ని రోజులు ఏడవాలి? పోరాటం ఎన్నిరోజులని చేయాలి. మా అక్కను తిరిగి ఇవ్వవా ప్లీజ్” అంటూ ఆమె చేసిన విజ్ఞప్తి అక్కడి వాతావరణాన్ని విషాదభరితం చేసింది.

ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి రాగానే మొట్టమొదటి కేసుగా సుగాలి ప్రీతి కేసును టేకప్ చేసి పరిష్కరిస్తానని పవన్ కళ్యాణ్ ఆ రోజు మాట ఇచ్చారు.

ఇప్పుడు జనసేన అధికారంలో భాగస్వామిగా ఉన్నా, డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కీలక పదవిలో ఉన్నా… తమ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

‘పవన్ కళ్యాణ్ ను మామయ్య’ అని పిలుస్తున్న ఆ అమ్మాయి, “నీ రాజకీయం కోసం మా ఫ్యామిలీని వాడుకున్నావ్” అంటూ నేరుగా ప్రశ్న సంధించడం సంచలనం సృష్టించింది. సుగాలి ప్రీతి తల్లి కూడా పవన్ కళ్యాణ్ తీరుపై ఇదే తరహాలో ప్రశ్నించారు.

దళితులపై, మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడుతానని పదే పదే చెప్పిన పవన్ కళ్యాణ్, ప్రస్తుతం అధికారంలో ఉండి కూడా తమకు న్యాయం చేయకపోవడం పట్ల వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. సుగాలి ప్రీతి కుటుంబం తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, తక్షణమే తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.

https://x.com/Anithareddyatp/status/1995318082810876195?s=20

Trending today

టీవీ5 ‘సాంబ’ సార్ బరెస్ట్

టీవీ5 ఛానెల్‌లో లైవ్ డిబేట్ నిర్వహిస్తూ తనదైన శైలిలో విశ్లేషణ చేసే...

కాపులు, దళితులు.. వైసిపి గేమ్ ఛేంజింగ్ ప్లాన్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా...

తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ.. కేసీఆర్ పరిస్థితి ఏంటి?!

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన...

బ్రహ్మానందంపై రెచ్చిపోయిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!

  వయసు పెరుగుతున్నకొద్దీ మనిషి మాటల్లో, నడవడిలో మరింత పరిపక్వత కనిపించాలి. ముఖ్యంగా...

బాబు లోకేష్ ఏం చేస్తున్నారు.. నిలదీసిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

Topics

ఏపీపై అంత ప్రేమ ఉంటే హైదరాబాద్ లో ఎందుకుంటున్నావు పవన్?

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు...

మోదీ బిగ్ అనౌన్స్ మెంట్!

న్యూక్లియర్‌ ఎనర్జీ అనేది వినియోగించే తీరుపై ఆధారపడి ఉంటుంది. దీనిని విధ్వంసానికి...

అమరావతి అవినీతిని బయటపెట్టిన ఏబీఎన్ వెంకటకృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లో నిలిచాయి....

Related Articles

Popular Categories