జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం శైలిలో “రెచ్చిపోతా.. నన్ను రెచ్చగొట్టొద్దు.. నన్ను గెలికితే బాగోదు” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర స్వరంతో మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షించింది.
అయితే, పవన్ కళ్యాణ్ ఈ దూకుడు ప్రదర్శనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “నీకు అంత సీన్ లేదు,” “కనీసం రెండు చోట్ల పోటీ చేసి ఒంటరిగా గెలవలేవు,” “ఈసారి టీడీపీతో పొత్తు వల్ల గెలిచావు, ఇంత ఓవరాక్షన్ పనికి రాదు” అంటూ పవన్ కళ్యాణ్‌కు కౌంటర్ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓటమి పాలైన పవన్ కళ్యాణ్, ఈసారి కూటమిలో భాగంగా పిఠాపురం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆయన వ్యాఖ్యలు నెటిజన్ల విమర్శలకు తావిచ్చాయి.
సోషల్ మీడియాలో “ఒంటరిగా ఎమ్మెల్యే కూడా అవ్వలేవు ఎందుకు అన్న ఈ సినిమా డైలాగులు” అంటూ ఈ డైలాగులను పవన్ కళ్యాణ్ గత రాజకీయ ప్రస్థానంతో ముడిపెట్టి ట్రోల్ చేస్తున్నారు. తన పార్టీకి సొంతంగా బలం లేదని, కేవలం టీడీపీ పొత్తుతోనే విజయం సాధించారని, కాబట్టి అనవసర దూకుడు పనికిరాదని నెటిజన్లు పదేపదే గుర్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన ప్రతిస్పందనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చను రేపుతున్నాయి.
వీడియో కోసం క్లిక్ చేయండి