పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లోనూ ఈ చిత్రంపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, ఫైర్ స్ట్రోమ్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమా రేంజ్ మరింత పెరిగింది.
అయితే, అభిమానులు ప్రస్తుతం నిరాశ వ్యక్తం చేస్తున్న అంశం ప్రమోషన్స్. సినిమా రిలీజ్‌కు కేవలం 35 రోజులు మాత్రమే మిగిలి ఉండగా, కొత్త అప్డేట్స్ చాలా ఆలస్యంగా వస్తున్నాయి. రెండవ పాట ప్రోమో వస్తుందని అధికారికంగా చెప్పినా, దానిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం అభిమానుల్లో ఆవేదన కలిగిస్తోంది.
అభిమానులు సోషల్ మీడియాలో నిర్మాతలపై విమర్శలు చేస్తున్నారు. “హరి హర వీరమల్లు” ప్రమోషన్స్‌లో చేసిన తప్పులను ‘ఓజీ’ టీం కూడా పునరావృతం చేస్తోందా?” అనే ప్రశ్నలు లేవుతున్నాయి. ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోవాలని, అభిమానుల ఆశలు వమ్ము కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.
మొత్తానికి, కంటెంట్‌తో ఆకట్టుకున్నా, ప్రమోషన్స్‌లో వెనుకబడ్డారని అభిమానుల అభిప్రాయం.