తెలంగాణలోని కొండగుట్ట ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ అనేది ముస్లింలకు గానీ, క్రిస్టియన్లకు గానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అన్ని మతాల సారం ఒక్కటేనని, అన్ని మతాలు గౌరవించబడాలనే అభిప్రాయాన్ని వెల్లడించారు.
టీటీడీ నిధులతో కొండగుట్ట ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమవడం ఆనందకరమని పేర్కొన్న పవన్, తెలంగాణ సమాజం తన రాజకీయ ప్రయాణానికి ధైర్యం ఇచ్చిందని అన్నారు. తనపై వేస్తున్న ‘హిందుత్వ ముద్ర’ ఆరోపణలను ఈ వ్యాఖ్యలతో ఆయన ఖండించినట్టయింది.
మరోవైపు తనపై హిందుత్వముద్ర పై పరోక్షంగా స్పందించారు పవన్. హిందూ వాదాన్ని బలపరచడం అంటే ముస్లింలకు వ్యతిరేకం కాదని.. క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదని.. ఇతర మతాలకు వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. అన్ని మతాల సారం ఒకటేనని.. అన్ని మతాలు గౌరవించబడాలని.. రక్షించబడాలి అనేది తన అభిమతంగా చెప్పుకొచ్చారు పవన్. అయితే ఇటీవల బీజేపీ లైన్లో పవన్ మాట్లాడుతున్నారు అంటూ కొన్ని రకాల కామెంట్స్ వినిపించాయి. దక్షిణ భారతదేశంలో పవన్ కళ్యాణ్ ద్వారా హిందుత్వ వాదాన్ని బిజెపి బలంగా తీసుకెళ్తుందన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపైనే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది. పవన్ కళ్యాణ్ కొండగుట్ట ఆలయం సెంటిమెంట్ గా ఉండేది


