ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన విద్యాభ్యాసానికి సంబంధించిన మాటలు మరోసారి చర్చకు దారి తీశాయి.
పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడుతూ… “నెల్లూరు బీఆర్ కాలేజీలో సీటు ఇవ్వక రికమండేషన్ మీద సీఈసీ గ్రూప్ ఇచ్చారు” అని అన్నారు.
అలాగే, “10వ తరగతిలో సరైన మార్కులు రాకపోవడంతో ఎంఈసీ తీసుకోవాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు.
మరొక సందర్భంలో, “ఇంటర్ చదివే సమయంలో ఎంపీసీ (MPC) ట్యూషన్లకు కూడా వెళ్లాను” అని చెప్పిన మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
ఇలా ఒకే వ్యక్తి మూడు రకాల గ్రూపుల గురించి వేర్వేరు సందర్భాల్లో చెప్పడం వల్ల ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివారు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా… గతంలో చెప్పిన మాటలే ఇలాంటి పరిస్థితికి కారణమయ్యాయనే చర్చ కూడా వినిపిస్తోంది.


