Top Stories

హర్ట్ అయిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఆయనే చేసిన అన్ని సినిమాలు తెలుగులోనే రిలీజ్ అయ్యాయి. కానీ మొదటిసారిగా పాన్ ఇండియా స్థాయిలో ‘హరిహర వీరమల్లు’ అనే భారీ ప్రాజెక్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు.

జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆరంభం నుంచి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. అసలు ఈ సినిమా జూన్ 12న విడుదల కావాల్సి ఉండగా… మళ్లీ వాయిదా పడింది. కానీ కొత్త రిలీజ్ డేట్ విషయంలో ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు మేకర్స్. దీంతో పవన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.

తీవ్రంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే షూటింగ్ పరంగా ఎంతో ఆలస్యం అయింది. అయితే పవన్ తన భాగాన్ని పూర్తిచేసినట్టు సమాచారం. కానీ విడుదల విషయంలో ఇప్పుడు మరోసారి అడ్డు కడుతోంది.

ఇక అసలు సమస్య ఏమిటంటే – ఈ సినిమా ఓటిటి హక్కులు ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌కు అమ్మకానికి వెళ్లిపోయాయి. మే 30న రిలీజ్ చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన ప్రైమ్ వీడియో, తర్వాత జూన్ 12న రిలీజ్ చేయాలని మూవీ టీమ్ అనౌన్స్ చేయగానే మళ్లీ వేచి చూసింది. కానీ ఆ డేట్‌కీ సినిమా రిలీజ్ కాకపోవడంతో, ఈసారి మాత్రం అమెజాన్ ప్రైమ్ మూడో ఛాన్స్ ఇవ్వబోమని ఘాటుగా చెప్పిందని సమాచారం.

ఈ సినిమాలో విడుదల మళ్లీ జూన్ చివరి వారానికి వాయిదా వేస్తే… ఓటిటి డీల్ మొత్తం రద్దు చేస్తామన్న గట్టిపెట్టు పెట్టినట్టు టాక్. లేదంటే, ఒప్పుకున్న అమౌంట్‌ని భారీగా కట్ చేస్తామని కూడా వారించిందని తెలుస్తోంది.

ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ మనసుకు కొంత తాకినట్టు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం. అతని డెడికేషన్‌ ఉన్నప్పటికీ, సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన లేటు ప్రభావం ఇప్పుడీ పరిస్థితి దాకా వచ్చేసింది.

పవన్ సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి కూడా ఆశించినంత స్పందన రాకపోవడం మరో కారణమని టాక్. మొత్తానికి ‘హరిహర వీరమల్లు’ సినిమా భవితవ్యంపై అస్పష్టత ఇంకా కొనసాగుతూనే ఉంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories