Pawan Kalyan మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల టైటిల్స్‌లో మాత్రమే ‘సింగ్’ కనిపించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు నిజ జీవితంలో సిక్కు సంప్రదాయ వేషధారణలో కనిపించి అభిమానులను ఫిదా చేశారు.
మహారాష్ట్ర పర్యటనలో భాగంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి నాందేడ్‌లోని గురుద్వారాను సందర్శించారు. సిక్కుల పదవ మత గురువు గురు గోవింద్ సింగ్ స్మారక స్థలమైన ఈ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుద్వారా ప్రముఖులు పవన్ కళ్యాణ్‌కు సంప్రదాయ సిక్కు తలపాగా (టర్బైన్) ధరింపజేయగా, ఆయన సాదర్‌ను సమర్పించి భక్తి భావంతో నమస్కరించారు.
సిక్కు వేషధారణలో పవన్ కళ్యాణ్ లుక్ పూర్తిగా మారిపోవడంతో అభిమానులు గుర్తుపట్టలేని స్థితి ఏర్పడింది. ఉత్తరాదిలోనూ అభిమానులు ఎగబడి ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాలపై కూడా దృష్టి పెట్టినట్లు ఈ పర్యటన స్పష్టంగా చూపిస్తోంది.


