నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి సీఎం విజయ భాస్కర్ రెడ్డి గారు కాకినాడ పోర్టును స్టార్ట్ చేశారు. దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయని.. పెట్టుబడులు వస్తాయని.. యువతకు ఉపాధి దొరుకుతుందన్న సదుద్దేశంతో ప్రారంభించారు. ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ కాకినాడ పోర్టును చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేవీ రావు అనే వ్యక్తికి ప్రైవేటుగా కట్టబెట్టారు. ఇదే అక్రమాలకు దారితీసింది. దీనికి గారు చంద్రబాబుకు, టీడీపీ ప్రభుత్వానికి భారీగానే కేవీ రావు సాయపడ్డారని ఇదే పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు..
కట్ చేస్తే ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసి అధికారంలోకి వచ్చాక కేవీ రావు కాకినాడ పోర్టుపై పడి ‘సీజ్ ద షిప్’ అంటూ హడావుడి చేశారు. ఇదంతా జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అని ఫోకస్ చేస్తున్నారు.
అసల కాకినాడ పోర్టును ప్రైవేటు పరం చేసిందే చంద్రబాబు. కేవీరావుకు అప్పగించి ఈ అక్రమాలకు తెరదీసింది చంద్రబాబు ప్రభుత్వం. కేవీరావు ఎన్నో సార్లు టీడీపీకి, ప్రభుత్వానికి భారీగానే చెక్కులు ఇచ్చిన వీడియోలున్నాయి.
ఇప్పుడు చంద్రబాబు పెంచి పోషించిన ఈ అవినీతిని ప్రశ్నించకుండా జగన్ పై మొత్తం పడేసి ఈ పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నాడు. మరి దీన్ని ఎలా చూస్తారని నెటిజన్లు వీడియోలతో సహా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.