పవర్ రేంజర్ వచ్చేశాడు. మరోసారి పవన్ ఫస్ట్రషన్ ను మనకు చూపించాడు. ఈ గోదావరి యాస కుర్రాడు తాజాగా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఫస్ట్రేషన్ తో పవన్ మాటలను పలికాడు. ఓ వీడియో పెట్టి చంద్రబాబు అండ్ కోపై విరుచుకుపడ్డాడు..
తాజాగా ‘పవర్ రేంజర్’ను అంటూ బయటకొచ్చాడు. ‘అందరికీ నమస్కారం అండీ.. నేనండీ పవర్ రేంజర్ ను ’ అంటూ వీడియోను రిలీజ్ చేశాడు. అదిప్పుడు వైరల్ అవుతోంది.
‘చినబాబును ఉప ముఖ్యమంత్రిని చేయాలా? పదవులన్నీ మీ అబ్బా కొడుకులు పంచుకుంటే నేను మీ పార్టీ ఆఫీసు ముందు పల్లీ చెక్కలు అమ్ముకోవాలా ఏంటి? ఇక్కడ నా మంత్రి పదవికి మంటపెట్టి నువ్వు ఎంచక్కా దావోస్ కు వెళ్లి మీటింగ్ కు అటెండ్ అవుతావా? మరో దశాబ్ధం సీఎంగా ఉండాలని నేను మిమ్మల్ని మోసేస్తుంటే.. నా డిప్యూటీ సీఎం మంత్రి పదవే లేపేయడానికి మ్యాప్ వేశావు కదయ్యా.. వెన్నుపోటుకు బట్టలు తొడిగితే బాబోరులా ఉంటారని బయట టాక్ ఉన్నా బై చాన్స్ మారుతావనుకున్నా.. కానీ నమ్మించి ఇలా గొంతుకోస్తావని గెస్ చేయలేకపోయానయ్యా’ అంటూ పవన్ ఆవేదనను కళ్లకు గట్టాడు.
బాబోరిని నమ్ముకొని మా జెండా కూలీల చేత బాగానే జెండా మోయించినందుకు బుద్ది చెప్పారంటూ పవన్ లోని ఫస్ట్రేషన్ ను పీక్స్ లో చూపించాడు. చినబాబు పాదయాత్ర ఓట్ల కోసం కాదు.. ఒంట్లో క్యాలరీలు బర్న్ చేయడానికి అంటూ సెటైర్లు వేశారు. పొత్తు లేనిదే ప్రభుత్వం లేదు.. ఈ పవర్ రేంజర్ లేనిదే బాబోరికి సీఎం పదవి లేదంటూ సీరియస్ గా వార్నింగులు ఇచ్చేశాడు.
ఇప్పుడీ పవర్ రేంజర్ వీడియోను మీరూ చూసి కామెంట్ చేయండి.