Top Stories

హీరోయిన్ తో ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా గత ఏడాది జూన్ 12న బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నిరంతరం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఎన్నికల ప్రచారం కోసం తన చేతిలో ఉన్న మూడు సినిమాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన ఆయన, గత ఏడాది డిసెంబర్‌లో తిరిగి షూటింగ్స్‌లో పాల్గొన్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభమై నాలుగు నెలలు గడిచే వరకు కూడా పవన్ కళ్యాణ్ తన బ్యాలెన్స్ సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోయారు.

ఎట్టకేలకు మే నెలలో తన పెండింగ్ సినిమాలకు సమయం కేటాయించడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. మొదట క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ ప్యాచ్ వర్క్ పూర్తి చేశారు. ఇక తాజాగా, సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో చురుగ్గా పాల్గొంటున్నారు.

ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇక్కడ పవన్ కళ్యాణ్‌పై కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల క్రితం, పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్‌ల మధ్య ఒక ఆసుపత్రి సన్నివేశాన్ని షూట్ చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశంలో కొన్ని యాక్షన్/ఫైట్ బ్లాక్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీనిని బట్టి ప్రియాంక మోహన్ ఇందులో డాక్టర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఈ వారంలో ముంబై వెళ్లనుంది. అక్కడ దాదాపు పది రోజుల పాటు చిత్రీకరణ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్, విలన్ పాత్రధారి ఇమ్రాన్ హష్మీల మధ్య యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించనున్నారని అంటున్నారు. ముంబై షెడ్యూల్ పూర్తయిన వెంటనే సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ముందుగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, బయ్యర్ల సూచన మేరకు సెప్టెంబర్ 25కు వాయిదా వేసినట్లు తాజా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 10 లోపు ప్యాచ్ వర్క్ తో సహా ‘ఓజీ’ చిత్రీకరణను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నారని సమాచారం. ఆ వెంటనే, జూన్ 12 నుండి హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నారు.

ఈ మూడు చిత్రాలు పూర్తయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవహారాలపై దృష్టి సారించనున్నారని తెలుస్తోంది. అంతే కాకుండా, ఈ ఏడాది చివరిలో కానీ, లేదా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని ఒక రూమర్ బలంగా వినిపిస్తోంది.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories