ఈ మధ్యన పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ఆయన్ను పట్టుకొని ‘సీఎం.. సీఎం’ అంటూ అరుపులు ఎక్కువైపోతున్నాయి. విశాఖ మన్యానికి వెళ్లినా అక్కడి గిరిజనులు ‘కాబోయే సీఎం పవన్ కళ్యాణ్.. జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
తాజాగా ఏపీ టీడీపీ మంత్రులు, అధికారుల ముందు ఓ సమావేశంలోనూ ‘సీఎం.. సీఎం’ అంటూ పవన్ కళ్యాణ్ ముందర అరుపులు అరిచారు. దీంతో నొచ్చుకున్న పవన్ కళ్యాణ్.. ‘సీఎంగా చంద్రబాబు ఉన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రిగా మనం గౌరవిద్దాం.. మీరు సీఎం సీఎం అంటూ అరవొద్దు.. డిప్యూటీ సీఎంగా నన్ను గౌరవించారు. వేదిక మీద ఉన్న నాయకులు ఇబ్బంది పడుతారు.. మీరు దగ్గరుండి అనిపించారని అంటారు.. మళ్లీ నాకు ఇబ్బందులు తెచ్చిపెట్టొద్దు’ అంటూ పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.
దీన్ని బట్టి తనకు డిప్యూటీ సీఎం పదవినే ఎక్కువ అని.. పరోక్షంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్టైంది. ఈ సీఎం అన్న నినాదాలు మళ్లీ తమ మధ్య విభేదాలకు కారణం అవుతాయని.. తానేదో చంద్రబాబు కుర్చీ ఆక్రమించడానికే ఇలా చేస్తున్నానని అపార్థం చేసుకుంటారనే భయం పవన్ లో వెంటాడుతోంది.