పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే రాజకీయంగా ఒక బలమైన నాయకుడిగానే కాకుండా, సినీ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా కూడా గుర్తుకు వస్తారు. అయితే, ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సినిమా పరంగా తన స్థాయిని, మార్కెట్‌ను చాలా నిజాయితీగా అంగీకరించారు పవన్ కళ్యాణ్.
తాను రాజకీయంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందానని, కానీ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో పోలిస్తే తన మార్కెట్ తక్కువని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. “నాకు అంత సీన్ లేదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తన సినిమాలకు రూ. 100 కోట్లు రీచ్ అవ్వడం కష్టమని, మిగతా హీరోలకు జరిగినంత బిజినెస్ తన సినిమాకు జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు.
“టాలీవుడ్ హీరోలతో పోల్చితే తన మార్కెట్, కలెక్షన్స్ చాలా తక్కువ” అని పవన్ నిజాయితీగా ఒప్పుకున్నారు. దీనికి ఉండే ఇబ్బందులు తనకు తెలుసని, మిగతా హీరోలకు అయినంత బిజినెస్ తనకు అవ్వదని ఆయన పేర్కొన్నారు. తన రేంజ్ ఏంటో ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ బయటపెట్టారు.
సినిమా పరంగా చాలా మంది హీరోలతో పోలిస్తే తాను వారందరికంటే తక్కువ అని, మిగతా హీరోలకు అయినంత బిజినెస్ తనకు కాదని, వారికి వచ్చినంతగా తనకు రాకపోవచ్చని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక స్టార్ హీరో అయి ఉండి, తన మార్కెట్ గురించి ఇంత నిజాయితీగా, నిస్సంకోచంగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ ధైర్యానికి నిదర్శనం అని చెప్పాలి. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో, అభిమానుల్లో పలు రకాల చర్చలకు దారితీశాయి.