విశాఖపట్నంలో నిర్వహించిన ప్రతిష్టాత్మక యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతా యోగా ఆసనాలు వేస్తూ ప్రశాంతంగా దృఢమైన స్థితిలో ఉండగా, పవన్ కళ్యాణ్ మాత్రం కొన్ని ఆసనాల్లో సరిగా స్థిరంగా నిలబడలేకపోయారు.
ఆయన కూర్చున్న స్థితిలో కూడా శరీరం ముందుకు, వెనుకకు ఒయ్యారంగా ఊగిపోయింది. మధ్యలో మెలికలు తిరిగి అసంతులితంగా కదలడం కనిపించింది. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న మీడియా కెమెరాల్లో కూడా బంధించడంతో వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
“పవన్ కళ్యాణ్‌కి శరీరం సహకరించలేదా?” అనే ప్రశ్నలు నెటిజన్ల నోళ్లలో వినిపిస్తున్నాయి. కొంతమంది పవన్ అనారోగ్యం కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడితే… మరికొంతమంది “ఇదేనా హీరో శరీర ధైర్యం?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
తాజాగా ఎన్నికల ఒత్తిడి, ఆందోళనలు కారణంగా పవన్ శరీరం అలసిపోయి ఉండొచ్చని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే యోగాలో ఇంత అస్థిరత ఎందుకన్నది మాత్రం అధికారికంగా ఎవ్వరూ స్పందించలేదు.
ఎలా ఉన్నా యోగాంధ్ర కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తన మరింత చర్చనీయాంశంగా మారింది. యోగా చేసే సమయంలో శరీరం, మనస్సు పూర్తిగా స్థిరంగా ఉండాలని ఉపదేశించే కార్యక్రమంలో పవన్‌కి ఇలా అవడం కొంత ఆశ్చర్యకరంగానే మిగిలింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పవన్ అభిమానులు మాత్రం “మన నాయకుడు అలసిపోయారు, విశ్రాంతి అవసరం” అంటూ తమ స్థాయిలో సమర్ధించుకుంటున్నారు.
మొత్తానికి ఈ యోగ కార్యక్రమంలో పవన్ మెలికలు… కొత్త చర్చలకు దారి తీశాయన్నది మాత్రం నిజం!
వీడియో కోసం క్లిక్ చేయండి